Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Lenicho Paapikaashrayame Ledu

యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు

Yesu Lenicho Paapikaashrayame Ledu

Chorus
యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు
Verse
లోకము నాలుగు దినముల నటనే నికరము గాదెవరికిని
దారిని తప్పి తిరిగెదవేల
ఎరిగితివా నీ గురిని కడకీలోకము వదలెదవు‖ కడకీలోకము వదలెదవు ‖
Verse
కూర్చుకొంటివి పాపము నిలలో కాలము వ్యర్థంబాయె
ప్రభువును నీవు మరచిపోతివి
పాడైపోయె నీ రూపం కడకీలోకము వదలెదవు‖ కడకీలోకము వదలెదవు ‖
Verse
ప్రభుయేసు సిలువలో వ్రేలాడె పాపిని రక్షించుటకు
పాట్లిపడె తనరక్తము కార్చె
పాపపు ముల్లును విరిచె కడకీలోకము వదలెదవు‖ కడకీలోకము వదలెదవు ‖
Verse
ప్రేమతో క్రీస్తు నిన్ను పిలిచెను ప్రియుడా త్వరపడి రమ్ము
ఆయన యందు నమ్మికయుంచిన
ఆయనే నీ శరణగును కడకీలోకము వదలెదవు‖ కడకీలోకము వదలెదవు ‖

Related Tags

GospelRepentanceSalvation