Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Maa Rakshakudu Kalmashamu Lenivaadu

యేసు మా రక్షకుడు కల్మషము లేనివాడు

Yesu Maa Rakshakudu Kalmashamu Lenivaadu

Verse
స్తోత్రించెదము దైవకుమారుని - నూతన జీవముతో
నిరంతరము మారని రాజును - ఘనంబు చేయుదము
Chorus
యేసు మా రక్షకుడు - కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ
Verse
భయంకరమైన భీతిని గొల్పెడు - జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి - బండపై స్థిరపరచెను
Verse
కనుపాపగ నను కాయు ప్రభుండు - కునుకడు నిద్రించడు
తనచేతితో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము
Verse
తల్లిదండ్రియు యెడబాసినను - విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజియించెదను - వల్లభుడేసు ప్రభున్
Verse
ఆత్మీయ పోరాటమునకు ప్రభువు - ఆత్మశక్తినిచ్చెన్
స్తుతియు నీకే ఘనతయు నీకే - యుగయుగములలోన

Related Tags

PraiseWorship