Chorus
యేసు మధుర నామము పాడుడి - ప్రభు
Verse
పరమును విడచి - ఇహమున కరిగెను
పాపుల కొరకై - రక్తము కార్చెను
పనరుత్థానుడై - రక్షణ నిచ్చె - పూర్ణముగా - ముగించె
Verse
దుఃఖము నుండి మము - విడిపించెను
శోకము రోగము లన్నియు - బాపెను
ఆదరించెను నాదు - హృదయ వేదనలలో - అద్భుతమున్ - జరిగించె
Verse
లోక పాపములను - మోసెను ప్రభువు
లోకము కొరకై గాయము లొందెను
అధర్మ కార్యములకై - నలిగెను ప్రభువు - అర్పించు కొనెను
Verse
ప్రియులారా రండి - కలసి పాడెదము
ప్రియుడగు ప్రభువున్ - ఆరాధించెదము
చరణములపై బడి - ఘనపరచెదము - చేరి భయభక్తితో