Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Mammu Nadipinchu Needu Kaapa

యేసు మమ్ము నడిపించు నీదు కాప

Yesu Mammu Nadipinchu Needu Kaapa

Lyricist: ఓకబ్ చేంబర్లేన్
Verse
యేసు, మమ్ము నడిపించు
నీదు కాపు కావలెన్
నీవు మమ్మును బోషించు
మమ్ముఁ జేర్చు మందలోన్
యేసునాధా, ప్రియనాధా!
మిమ్ము విమోచించుమా.
Verse
మమ్ము నాదరించు యేసూ
మాకు పాలకుండవు
పాప మార్గమందు నుండి
ప్రేమతో! దప్పించుమీ
యేసునాధా, ప్రియనాధా!
మొఱ్ఱ నాలకించుమా.
Verse
బీద పాపు లైన మమ్ము
నీ వంగీకరింతువు
మమ్మును బవిత్రపర్చి
మమ్ము విడిపించుమీ
యేసునాధా, ప్రియనాధా!
నిన్ను నాశ్రయింతుము
Verse
బాల్యమందు నిన్నుఁ జేరి
నిన్ను హత్తుకొందుము
ప్రియ రక్షకుండ, యేసూ
నీ ప్రేమఁ జూపుమా
యేసునాధా, ప్రియనాధా!
మమ్మింకఁ బ్రేమించుమా.

Related Tags

GuidanceShepherdSavior