Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Mammu Nadipinchu Needu Kaapu Kaavalen

యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్

Yesu Mammu Nadipinchu Needu Kaapu Kaavalen

Verse
యేసు మమ్ము నడిపించు, నీదు కాపు కావలెన్
నీవు మమ్మును బోషించు - మమ్ము జేర్చు దొడ్డిలోన్
యేసునాథా! ప్రియనాథా! మమ్ము విమోచింపుమా
Verse
మమ్ము నాదరించు యేసూ - మాకు పాలకుండవు
పాప మార్గమందు నుండి - ప్రేమతో దప్పించుమీ
యేసునాథా! ప్రియనాథా! మొఱనాలకించుమా
Verse
బీద పాపులైన మమ్ము - నీ వంగీకరింతువు
మమ్మును బవిత్రపర్చి - మమ్ము విడిపించుమీ
యేసునాథా! ప్రియనాథా! నిన్ను నాశ్రయింతుము
Verse
బాల్యమందు నిన్నుఁ జేరి - నిన్ను హత్తుకొందుము
ప్రియ రక్షకుండ, యేసూ! నీదు ప్రేమఁజూపుమా
యేసునాథా! ప్రియనాథా! మమ్మింకఁబ్రేమించుమా

Related Tags

ProtectionGuidanceShepherd