Chorus
యేసు మనతోనుండగ ధైర్యముగా సాగుచు
కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము
Verse
పాత సంగతులన్నియు గతించె మరల రావుగ
యేసునందు క్రొత్తవై నూతనముగ నడుపును
యేసు ప్రభుని యాజ్ఞలు అద్భుతముగ దొరికెను
పరమ దర్శనమందుండి తొలగిపోము యెన్నడు
Verse
సైతాను శరీరము లోకముతో పోరాడుచు
యెంత క్రయమునైనను సంతోషముగ చెల్లింతుము
యుద్ధ మందు జయమొంద ప్రభుని శక్తి పొందెదం
యేసు జయము పొందుచు సాతాను రాజ్యమణచెదం
Verse
దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక
యేసు నామమందున పొందెదము శక్తిని
అల్పకాల యాత్రలో గొణుగు సణుగు లుండక
ప్రతి పరిస్థితియందు తృప్తిచెంది యుందుము
Verse
క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందము
ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం
నాగటిమీద చేతిని వుంచి వెనుక తిరుగము
యేసు వైపు చూచుచు ఆయనతోడ నడచెదం
Verse
మనలో పాత పురుషుని చంపెదము సిలువలో
అంతరంగ పురుషునందు బలమును పొందెదము
ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందెదం
శరీర యిచ్ఛలన్నియు అణగద్రొక్కి వేసెదం
Verse
విడచెదం ఈలోకము యాత్ర పూర్తి చేసెదం
పరమ రాజ్యమందున పరమ గృహము చేరెదం
యేసు ప్రభును సంధించెదం ఆనందముతో నిండెదం
బహుమానములు పొందెదం సదా ఆయనతో నుండెదం