Verse
యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు
యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు‖ 2x ‖
ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును
చింతలన్ని బాపి శాంతినిచ్చును‖ 2x యేసు మంచి ‖
Verse
శాశ్వతమైన ప్రేమతో
నిన్ను నన్ను ప్రేమించాడు‖ 2x ‖
సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు
తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు‖ 2x యేసు మంచి ‖
Verse
శాంతి సమాధానం మనకిచ్చాడు
సమతా మమత నేర్పించాడు‖ 2x ‖
మార్గము సత్యము జీవమైనాడు
మానవాళికే ప్రాణమైనాడు‖ 2x యేసు మంచి ‖