Verse 1
యేసు నా సొంతమై - నేను ప్రభు సొంతమై
ఈ అనుబంధం నిలవాలయ్య - నీ రాకకై సాగాలిలా
Verse
అ.ప. యేసయ్య నా యేసయ్య
Verse
దివారాత్రులు నాకై నీవు - వేచి చూచితివే
చెదరిన నాపై బాహువు చాపి - చేరదీసితివే
నిన్ను విడిచి ఉండలేను - నీవు లేక నేనే లేను
Verse
నాకు కలిగిన బాధలన్నిట - తోడు నిలిచితివే
కృంగియున్న నన్ను లేపి - కృపలో దాచితివే
నీకు దూరమై ఉండలేను - నీవు లేక నేనే లేను
Verse
నేను నీపై ఆనుకొనగా - ఆదరించితివే
భారమైన నాదు కాడిని - నీవే మోసితివే
నిన్ను మరచి ఉండలేను - నీవు లేక నేనే లేను