Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naa Hrudhayamunanduna Nivasincharammu Hrudhayashuddhi Nimmu

యేసు నా హృదయమునందున నివసించరమ్ము హృదయశుద్ధి నిమ్ము

Yesu Naa Hrudhayamunanduna Nivasincharammu Hrudhayashuddhi Nimmu

Verse
యేసు నా హృదయమునందున - నివసించరమ్ము
హృదయశుద్ధి నిమ్ము
Verse
నిండెను పాపముతో నా జీవం
అండను నేను గాంచలేదెచ్చట
అండయై దారిని జూపువాడెవడు
పొందుగ జూపునీవే
Verse
ఎటు జూచిన కారు చేకటియే
ఎటులేగిన యశుద్ధతయే
ఎచ్చట గాంచనైతి రక్షకుని
నీవే రక్షకుడవు
Verse
తిరిగితి నే లోకమంతయున్
చేరితి నే నీ ద్వరము నొద్దన్
నా ప్రాణ యాధారంబు నీవేగా
నా ప్రభు చేర్చుదారిన్
Verse
కార్చితివేసు రక్తము నాకై
చేర్చితివేసు తండ్రితో ప్రిఏమన్
నిత్యపురము నన్ను జేర్చితివి
నిత్యజీవ మిచ్చితివి

Related Tags

PrayerRepentanceJesus