Verse
యేసూ, నా ప్రభువా,
నీ ప్రేమ లేకున్న
నా యాత్మ కేదియు
విశ్రాంతి నియ్యదు.
ఒక్కొక్క గంట నేను‖ ఒక్కొక్క గంట ‖
నిన్నాశించుకొందు
నీ యాశీర్వాద మిమ్ము
నా రక్షకుఁడా‖ రక్షకుఁడా ‖
Verse
యేసూ, రేబగుళ్లు
నా యొద్ద నుండుము
నాతో నీవుండిన
నే భయ ముండదు.
Verse
సుఖంబుఁ బొందఁగా
నిన్నే యాశింతును
దుఃఖంబు నొదఁగా
నీవే శరణ్యము.
Verse
నీ మార్గమందున
నే నడ్వ నేర్పుము
నీ మాట చొప్పున
నన్నున్ దీవించుము.
Verse
నిన్నే యాశింతును
యేసూ, నా ప్రభువా
నీవంటివాఁడనై
నన్నుండఁ జేయుము.