Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naa Prabhuvaa Nee Prema Lekunna

యేసూ నా ప్రభువా నీ ప్రేమ లేకున్న

Yesu Naa Prabhuvaa Nee Prema Lekunna

Verse
యేసూ నా ప్రభువా - నీ ప్రేమ లేకున్న
నా యాత్మ కేదియు - విశ్రాంతి నియ్యదు
Chorus
ఒక్కొక్క గంట నేను - నిన్నాశించుకొందు
నీ యాశీర్వాదమిమ్ము - నా రక్షకా
Verse
యేసూ, రేబగళ్ళు - నాయొద్ద నుండుము
నాతో నీ వుండిన - ఏ భయముండదు
Verse
సుఖంబు బొందగా - నిన్నే యాశింతును
దుఃఖంబు నొందగా నీవే శరణ్యము
Verse
నీదు మార్గమందున - నే నడ్వనేర్పుము
నీ మాట చొప్పున - నన్నున్ దీవించుము
Verse
నిన్నే యాశింతును - యేసూ నా ప్రభువా
నీ వంటి వాడనై - నన్నుండ జేయుము

Related Tags

WorshipPrayerDevotion