Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naa Siluva Neththi Yippudu

యేసు నా సిలువ నెత్తి యిప్పుడు

Yesu Naa Siluva Neththi Yippudu

Lyricist: Panthagani Paradeshi
Verse
యేసు! నా సిలువ నెత్తి యిప్పుడు నే నీ సుమార్గముఁ బట్టితి నా
స్వజనము లనాదరంబునఁ త్రోసినను పగజేసిన నా సమస్తము నీవెగా
యిక నే సరకుగొన నేమియున్‖ యేసు ‖
Verse
ఎన్ని శ్రమలు వచ్చిన లోకపు టాశ లన్ని భిన్నము నొందిన నన్ను
ఖిన్నునిజేయ నేరవు సన్నుతుండును స్వర్గము నన్ని నావైయున్న విగ నిఁక
నన్నుఁ గదుపున దెవ్వరు‖ యేసు ‖
Verse
ఆపదల్ ననుఁ జుట్టినఁ జేరుదు నే నో పరాత్పర రొమ్మునఁ బ్రావ
కుండవు పతితుఁడై నీ దాపు జేరిన వానికిన్ దాప మాపుచు సంతసంబిడి
ధన్యుఁ జేయుదు వీవెగా‖ యేసు ‖
Verse
నినుఁ బ్రేమించెడు తండ్రిని నా యాత్మా నిను రక్షించిన క్రీస్తును
గనుమునిన్నుఁ జొ చ్చిన ప్రియాత్మను ఘన త్ర్యేకుని నిత్యమున్ గొనుము
రక్షణ, పాపము చింతను విడిచి యిం కెన్నఁడున్‖ యేసు ‖
Verse
విశ్వాస కవచంబును మేను నిడి విజ్ఞాపనము చేయుము శాశ్వతంబగు
రాజ్యమునకును సదయుఁడౌ ప్రభువు నడుపు విశ్వసితము లభించునట
నీ విన్నపము స్తుతి యౌనుగా‖ యేసు ‖

Related Tags

CrossGood FridaySacrifice