Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naa Yaathma Rakshakunda Nannu Va

యేసూ నా యాత్మ రక్షకుండ నన్ను వ

Yesu Naa Yaathma Rakshakunda Nannu Va

Lyricist: Matthai Samuyelu
Chorus
యేసూ నా యాత్మ రక్షకుండ నన్ను వాసిగా నీ రొమున నుండఁ
జేసియు జల రాసులను నీవు తీసివేయుము మోసములఁ ద్రోసి‖ యేసూ ‖
Verse
జీవబాధ నే దాఁటుదాఁక నన్ను నీవె దాఁచము నా రక్షక రూపునకు
నడ్పి ప్రోవు మో యేసు దేవ యాత్మను జీవమును జేర్చు‖ యేసూ ‖
Verse
ప్రాపు లేని నా యాత్మన్ నీవు నీదు దాపునకుఁ జేర్చి ప్రోచి కావు మో
పరమాత్ముఁడా యోపికతోఁ జూచి యాపదలఁ బాపి యాదరించుము‖ యేసూ ‖
Verse
నా నమ్మకము నీ యందున్నది నీలో నేను గోరు సాయంబున్నది గాన
నేఁ బ్రాపు లేని నా తలను బూని రెక్కల లోన గప్పుము‖ యేసూ ‖
Verse
యేసు నీవే నాకు సర్వము నీదు దాస జనుల లేవనెత్తుము నీ సుబల
మిమ్మో యేసు రోగులకు వాసిగాఁ జీకు వారలను నడ్పి‖ యేసూ ‖
Verse
నా వంటి ఘోరపాపి యేడి యేసు నీవంటి పరిశుద్ధుఁ డేడి కేవలము
సత్య భావముతో నిండి నీవు కృపగల దేవుఁడవు స్వామి‖ యేసూ ‖
Verse
నీదు కృపా బాహుళ్యమందు యేసు నాదు పాపము గప్పుకొందు సాదరం
బగు నీదు మాటల మోదమున శుద్ధి పాదుకొననిమ్ము‖ యేసూ ‖
Verse
నీవు నిత్యజీవపు టూటవు నాకు జీవజలంబు నిచ్చి కావు మీపు నా
యెదలోఁ గావఁగ లేచి జీవపదవికిఁ త్రోవ దీయుమా‖ యేసూ ‖

Related Tags

WorshipPrayerSalvation