Chorus
యేసు నామ మెంతో మధురం యేసు నామ మెంతో మధురం
దోసములు మోసములు నాధ మొనరించు ప్రభు‖ యేసు ‖
Verse
స్వాంతమునకు శాంతి నిడును చింతలను భ్రాంతులను వింతలుగఁ
ద్రుంచు ప్రభు‖ యేసు ‖
Verse
నెమ్మి జేయు కమ్మివేయు నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము జేయు
ప్రభు‖ యేసు ‖
Verse
ప్రేమ లెదుగ క్షేమ మొదపు కామ గుణ పామరతి లేమి చొరనీదు
ప్రభు‖ యేసు ‖
Verse
మోక్ష దశకు సాక్ష్య మొసఁగు నక్షయ సురక్షణకు దక్షత వహించ
ప్రభు‖ యేసు ‖
Verse
శీల మతుల పాలి వెతలఁ తూలఁ జనఁదోలి తన జాలి కనపరచు
ప్రభు‖ యేసు ‖