Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naamam Annitikanna

యేసు నామం అన్నిటికన్న

Yesu Naamam Annitikanna

Verse
యేసు నామం అన్నిటికన్న
శ్రేష్ఠమైన నామం
యేసు స్మరణే ఎప్పటికైనా
అభయము ఆధారమే
పాడుదాం చాటుదాం
యేసు జన్మ వార్తను
చూపుదాం నిలుపుదాం‖ 2x ‖
ప్రభు ప్రేమ సువార్తను‖ 2x యేసు నామం ‖
Verse
దేవుడే మనిషిగ పుట్టెను
దాసునిగా వచ్చెను ఇదియే ఆశ్చర్యము
ప్రభువే మన పాపము కొరకై‖ 2x ‖
భువికరుదెంచెను
చూడు ఎంత ప్రేమయో
కృపగల దేవుడు యేసయ్యా
దయగల దేవుడు మెస్సయ్యా‖ 2x ‖
పాడుదాం‖ యేసు నామం ‖
Verse
గొల్లలు జ్ఞానులు చూచిరి
స్తుతులర్పించిరి సాక్షులుగా నిలిచిరీ
యేసునీ ప్రేమను తెల్పుదాం‖ 2x ‖
లోకాన చాటుదాం
సాక్షులుగా బ్రతుకుదాం
ఇదేగా క్రిస్ట్మస్ ఆనందం
ఇదేగా క్రిస్ట్మస్ సంతోషం‖ 2x ‖
ఆడుదాం‖ యేసు నామం ‖

Related Tags

PraiseWorshipChristmas