Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naamam Betthi Paadudhama Krees

యేసు నామం బెత్తి పాడుదమ క్రీస్

Yesu Naamam Betthi Paadudhama Krees

Lyricist: Purushothamu Choudari
Chorus
యేసు నామం బెత్తి పాడుదమ క్రీస్తు దాసులతో ఁ బొత్తుఁ గూడు దమ‖ యేసు ‖
Verse
ఇహసంబంధుల పొందుఁ జాలింతమ మహా మహుఁడౌ దేవుని యాజ్ఞఁ
బాలింతమ‖ యేసు ‖
Verse
శుభవార్తర్థము లన్ని శోధింతమ యేసువిభు సత్యమిలలోన నుభవింతమ‖ యేసు ‖
Verse
దోషములను బైటఁ బెట్టుదము కపట వేషభాషలఁ గ్రుంగఁ బట్టు దమ‖ యేసు ‖
Verse
మన రక్షకుని పాట్లు మది నెంతమ మనసు లోపలి గర్వము లణుపుదమ‖ యేసు ‖
Verse
జనుల నిందల కెల్ల నోర్చెదమ బోధ కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ‖ యేసు ‖
Verse
మానావమానముల్ భరియింతమ యోర్వ లేని గుణముల వేరుఁ
బెరుకుదమ‖ యేసు ‖
Verse
పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ బుద్ది పరమానందము జాడ నడుపు
దమ‖ యేసు ‖
Verse
సకల మానవు లాత్మ సరిచూతమ యింక మొక మిచ్చకపు మాట
ల్విడిచెదమ‖ యేసు ‖
Verse
దినము ప్రార్థనఁ జేయ గురి యుంతమ చెడ్డ మనసు బద్ధకముపై
నెదిరింతమ‖ యేసు ‖
Verse
గురు బోధ స్థలికి బిరబిరఁ బోదమ బుద్ధి తిర ముంచి వాక్యార్థ మెఱు
గుదమ‖ యేసు ‖

Related Tags

WorshipDevotionalPrayer