Chorus
యేసు నామం మనోహరం - ఎంతో అతిమధురం
పరమునందైన ఇహమునందైన వేరే నామమే లేదు
Verse
అమూల్య ప్రాణమిచ్చెన్ - పాపులను రక్షించుటకై
దాసుని రూపమొంది - ఇహమున దిగివచ్చెను
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప
Verse
కల్వరిగిరిలో ఇనుపమేకులతో
ప్రభువా నీ దేహమును - సిలువపై నెక్కించిరి
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప
Verse
పూర్ణ స్వస్థత మాకు - ప్రేమతో నొసగితివి
శాంతి ఆనందములు - నీ నామమున దొరుకున్