Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naamame Paavanamu Maaku Yesu Gada

యేసు నామమే పావనము మాకు యేసు గద

Yesu Naamame Paavanamu Maaku Yesu Gada

Lyricist: Purushothamu Choudari
Chorus
యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దాస
జన హృద్వికాసమైయెల్ల దోసములకు వి నాశకరమైన‖ యేసు ‖
Verse
సాధు మానసోల్లాసములు యేసు నాధు గుణ చిద్విలాసములు బోధఁ
గొను వారి బాధ వెడలించి మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు.‖ యేసు ‖
Verse
భక్త జన లోక పూజ్యములు రక్త సిక్త పాదపయోజములు ముక్త
రాజ్యాభి షిక్తుఁడౌ సర్వ శక్తి యుతుఁడైన సామియగు క్రీస్తు‖ యేసు ‖
Verse
దీన జన నిత్య తోషణము సిల్వ మ్రాని ప్రభు మృత్యు ఘోషణము
పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవుల కెల్ల‖ యేసు ‖
Verse
పాపులకు మంచి పక్షములు ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు పాప
సందోహ కూపమునఁ గూలు కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు‖ యేసు ‖

Related Tags

PraiseSalvationJesus