Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naamamruthamu Kannanu Vere Maaka

యేసు నామామృతము కన్నను వేరే మాక

Yesu Naamamruthamu Kannanu Vere Maaka

Lyricist: Gollapalli Nathaniel
Chorus
యేసు నామామృతము కన్నను వేరే మాకిఁక లేదుగా దోసముల
నెడబాపి పరమని వాస పదవికిఁ జేర్చుఁగా‖ యేసు ‖
Verse
నిత్య రక్షణ నిత్య జీవము నిజముగా మాకిచ్చును సత్యసువిశేషార్థసారము
సతము గ్రోలుట కొసఁగెను‖ యేసు ‖
Verse
దురిత భవ మను నంధకారము దూరముగఁ బోఁదోలెఁగా అరయఁ
దన విమలాత్మ వరమున మరల మము వెలిఁగించెఁగా‖ యేసు ‖
Verse
గొప్ప కుల గర్వముల మెప్పను తప్పుల న్విడఁగొట్టెను చెప్ప శక్యముగాని
రక్షణ సృష్టిలో మము నిల్పెను‖ యేసు ‖
Verse
అడ్డు పరచు పిశాచి మార్గపు జిడ్డులను ఛేదించెను దొడ్డ కాపరి యేసు
తన దగు దొడ్డిలో మముఁ జేర్చెను.‖ యేసు ‖

Related Tags

WorshipSalvationJesus