Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naamamu Smarinchu Baadha Neeku

యేసు నామము స్మరించు బాధ నీకుఁ

Yesu Naamamu Smarinchu Baadha Neeku

Lyricist: L Chactser
Verse
యేసు నామము స్మరించు
బాధ నీకుఁ గల్గఁగా
నద్ది క్షేమ సౌఖ్య మిచ్చు
దాని స్మరియించుము.
శ్రేష్ఠమౌ నామము‖ శ్రేష్ఠమౌ నామము ‖
ఆదరించు నిలను
శ్రేష్ఠమౌ నామము
మోక్షసౌఖ్య మద్దియే
Verse
యేసు నామము స్మరించు
శోధనంబు లుండఁగా
డాలుగాను దాని నెంచి
వేఁడుమా సునామమున్
Verse
మమ్ముఁ జేరఁదీయు యేసు
నామము స్తుతింపఁగా
మాధుర్యంపు నామ మౌను
ఆత్మ కద్ది తుష్టియే
Verse
మ్రొక్కుచుందు మేసు నాధ
నీదు పాద పద్మముల్
మోక్షమందుఁజేరఁగాను
హెచ్చుగా నుతింతుము

Related Tags

PraiseWorshipJesus