Verse
యేసు నాథా దేవా
వందనాలు రాజా.. వందనాలు
రాజాధి రాజా నీకే వందనాలు
రవి కోటి తేజా నీకే వందనాలు‖ 2x యేసు నాథా ‖
Verse
పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు
పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి‖ 2x ‖
పన్నెండు గుమ్మముల…
పట్టణమే నాకు కట్టిపెట్టినావా‖ రాజాధి రాజా ‖
Verse
నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు‖ 2x ‖
నీ నీతి నీ రాజ్యం…
నిండైన నా భాగ్యమే‖ రాజాధి రాజా ‖
Verse
హీనుని దీవించి ఘనునిగా చేసావు
నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు‖ 2x ‖
నా సల్లనయ్యా…
నా యన్న నీవే నా యేసయ్యా‖ రాజాధి రాజా ‖
Verse
కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను
చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు‖ 2x ‖
నీ మనసే వెన్నయ్యా…
నా కన్న తండ్రి నా యేసయ్యా‖ రాజాధి రాజా ‖