Chorus
యేసు నాథ కథా సుధా రస మిదిగో పానముఁ జేయరే దోసకారి
జనంబులారా దురిత భవముల బాయరే‖ యేసు ‖
Verse
ఇహపరంబు లెవనిచే సృజి యింపఁబడియెనొ చూడరే అసహహ యా
విభుఁ డవతరించెను అతని గుణములఁ బాడరే‖ యేసు ‖
Verse
దురిత భరితుల దుష్ట చరితుల నరయ వచ్చెను జూడరే స్థిరముగామది
నమ్మి యా ప్రభు కరుణ మదిఁ గొనియాడరే‖ యేసు ‖
Verse
పనికిమాలిన వేలుపుల దెస పరుగు లెత్తుట మానరే తనువు మీ
కొఱ కిచ్చు క్రీస్తుని దయకుఁ బాత్రతఁ బూనరే‖ యేసు ‖
Verse
మరణ బలి రక్తమున మన యం దఱిని బ్రోవను వచ్చెను కరుణతోఁ
బాపులఁ బిలుచు గురు దరికిఁబోవుద మిచ్ఛను‖ యేసు ‖
Verse
పరమతత్వ విధాన బోధలు బాగుగఁ బ్రకటించెను చిరసుఖాస్పద
పదముఁ గోరిన జీవులకు వినిపించెను‖ యేసు ‖
Verse
మరణ మొందిన కొందఱికిఁ దా మరలఁ బ్రాణము లిచ్చెను వర
మహాద్భుత కార్యముల ని ద్ధర ననేక మొనర్చెను‖ యేసు ‖
Verse
కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన గోష్టి నుండుట గోరరే దిటముగను
నెమ్మదిని మీరొం దుటకుఁ క్రీస్తునిఁ జేరరే‖ యేసు ‖