Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naavaadani Nammudhun Bhaasil

యేసు నావాడని నమ్ముదున్ భాసిల్

Yesu Naavaadani Nammudhun Bhaasil

Lyricist: Frances Janevan Alstein
Verse
యేసు నావాడని నమ్ముదున్
భాసిల్లు దివ్య సౌభాగ్యము
దాసుఁడ నౌచు పాల్పొందెదన్
నాశంబు లేని సౌఖ్యంబును.
ఇదే నా పాట నాసుకధ‖ ఇదే నా పాట నాసుకధ ‖
యేసుని సదా స్తుతించుట
ఇదే నా పాట నాసుకధ
యేసుని నిత్యం ధ్యానించుట
Verse
సంపూర్ణ భక్తితో నుండెదన్
పెంపార యేసున్ ధ్యానించెదన్
సొంపైన దూతల్ పాడుచుండన్
ఇంపైన పాటల్ నే విందును.
Verse
నిండైన భక్తియే నెమ్మది
గెల్చున దేమి యేసుండఁగ
మెండైన దీప్తిన్ బ్రార్థించుచు
దండిగ బ్రేమన్ సుఖింతును.

Related Tags

Devotional