Verse 1
Reference: నేను నా ప్రియునిదానను పరమగీతము 7:10
Verse
యేసు నావాడని నమ్ముదున్ - ఎంతెంతో దివ్య సౌభాగ్యము
దాసుడనౌచు పాల్పొందెదన్ నాశంబులేని సౌఖ్యంబును
Chorus
ఇదే నా పాట నా సుకథ యేసుని సదా స్తుతించుట
ఇదే నా పాట నా సుకథ యేసున్ నిత్యము ధ్యానించుట
Verse
సంపూర్ణ భక్తితో నుండెదన్ - పెంపార యేసును ధ్యానించెదన్
సొంపైన దూతల్ బల్కుచుండన్ - ఇంపైన మాటల్ నే విందున్
Verse
నిండైన భక్తితో నెమ్మది నిల్చునదేమి యేసుండగ
మెండైన దీప్తిన్ బ్రార్థించుచు - దండిగ బ్రేమన్ సుఖింతును