Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naayakuda Yella Velalanu Nee Da

యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ ద

Yesu Naayakuda Yella Velalanu Nee Da

Lyricist: Gollapalli Sataniyel
Chorus
యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా
మోసములన్నిటి మునగఁద్రోతునని బాసలు జేసిన ప్రభుఁడవు నీవెగా‖ యేసు ‖
Verse
రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి
దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా‖ యేసు ‖
Verse
హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును
సదయుఁడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ‖ యేసు ‖
Verse
కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ
పాపములును ఏలకుండగ నీ ప్రాపునఁబెంచుము మాపాలకుఁడవో‖ యేసు ‖
Verse
మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోఁగొట్టగ మానము మహిమలు
మనుజుల కియ్యను భానుఁడ రాజుగ బ్రతికిలేచితివి‖ యేసు ‖
Verse
చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల
నిడితివి ధరలో నరులకు పరముఁడ నీ దయ మరువశక్యమా‖ యేసు ‖

Related Tags

PrayerDevotionGuidance