Verse
యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు
నీ శరణు వేడగానే - నా పాపభారము తొలగె
Verse
నే దూరమైతి నీకు - నశియొంచితి లోకమున
నేను గ్రహించలేదు - నీ హృదయ ప్రేమను
Verse
నే తలచలే దెప్పుడు - నా అంత మేమవునని
నా పాపములచే నేను - నిన్ను విసిగించితిని
Verse
నిన్ను నేగాంచగానే - నా జీవితము మారెను
నేనెంతో గ్రుచ్చబడి - నిన్నంగీకరించితి
Verse
రక్షణ దొరికె నాకు రక్తముతో నన్ను కడిగి
రయముగా నీ చెంతకు - రక్షకా తెచ్చితివి
Verse
పరిశుద్ధులలో చేర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చి
పూర్ణాధికారము నిచ్చి - పరలోకము తెరచితివి