Verse
యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని
పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి
Chorus
వందన మర్పింతు కృపనొందితి
తన రాజ్యమందున చేరితిని
Verse
తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగె
చేతికుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగె
Verse
దోషముల్ క్షమింపబడె నా పాపము కప్పబడె
నా ఋణపత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చె
Verse
పాపపు శిక్ష తొలగెన్ నే నూతన సృష్టినైతిని
రాజుగజేసె యాజకునిగను పాడెద హల్లెలూయ
Verse
ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును
ఆదినమునకై ప్రీతితోనేను కనిపెట్టుచున్నాను