Verse
యేసూ నన్ను ప్రేమించినావు
పాపినైన – నన్ను ప్రేమించినావు‖ 2x ‖
Verse
నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి
దా-నముగా జీవము సిలువపై‖ 2x ‖
ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో‖ 2x యేసూ ‖
Verse
తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే
దురుతుండనై యుంటిని‖ 2x ‖
నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు
డేహ్యంబులై యుండగ‖ 2x యేసూ ‖
Verse
మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్
మించ ప్రేమించి-నావు‖ 2x ‖
ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు‖ 2x యేసూ ‖
Verse
నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని
మున్నై తెలిసియుంటివి‖ 2x ‖
తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము‖ 2x యేసూ ‖
Verse
నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన
నా వలన ఫలము కోరు‖ 2x ‖
ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో
కేవలంబేమీ లేక‖ 2x యేసూ ‖