Chorus
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు
Verse
నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై
నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో‖ యేసు ‖
Verse
తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని
నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ‖ యేసు ‖
Verse
మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు
ఆహా యెంచ శక్యముగాని మంచి నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు‖ యేసు ‖
Verse
నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి
తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న కారణమేమో యన్నా తెలియదు
చిత్రము‖ యేసు ‖
Verse
నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముఁ
గోరు ఆహా నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలంబేమి లేక‖ యేసు ‖