Verse
యేసు నీ క్రుపలో
Chorus
యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా
మమ్ము రక్షించి నిత్య రాజ్యములో
నడుపము మా ప్రభువా - నడుపుము మా ప్రభువా‖ Yesu ‖
Verse
కృంగిన వేళలలో - అలసిన సమయములో
నా చేయి విడువకను - నన్ను నిలబెట్టు
నన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసి
నిలుపుము జ్యోతివలె - నిలుపుము జ్యోతివలె‖ Yesu ‖
Verse
సిలువను మోసికొని - సువార్త చాటింప
విలువగు నీ శక్తిచే - నిత్యము నడిపించు
యేసు నీ రాకడలో - నిన్ను ఎదుర్కొనుటకు
నీ కృప నీయుమయా - నీ కృప నీయుమయా‖ Yesu ‖