Verse
యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా 2x‖ 2x ‖
దేవ
మా – దోషములను హరించి మోక్షని
వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన యేసు‖ యేసు ‖
Verse
వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి 2x‖ 2x ‖
దేవ
యెంతో – కీడు జేసిన పాడు వైరిని
గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి యేసు‖ యేసు ‖
Verse
పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా 2x‖ 2x ‖
దేవ
నీ – దాపు జేరిన వారి కందరి
కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు యేసు‖ యేసు ‖
Verse
అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే 2x‖ 2x ‖
దేవ
మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు
రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు యేసు‖ యేసు ‖
Verse
అందమగు నీ మందిరమున – బొందుగా మేము 2x‖ 2x ‖
దేవ
నీ – సుందర కరుణామృతము మా
డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన యేసు‖ యేసు ‖