Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Nee Naamamruthamu Maa Kentho Rucha

యేసు నీ నామామృతము మా కెంతో రుచ

Yesu Nee Naamamruthamu Maa Kentho Rucha

Lyricist: Yosepu Daniyelu
Chorus
యేసు నీ నామామృతము మా కెంతో రుచి యయ్యా దేవ మా
దోసములను హరించి మోక్షని వాసులుగఁ జేయుటకు భాసుర ప్రకాశమైన‖ యేసు ‖
Verse
వేడు కలరఁగఁ గూడి నినుఁ గొని యాడు వారికి దేవ యెంతో
కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని తాడనము జేసితివి‖ యేసు ‖
Verse
పాపములు హరింప నీవే ప్రాపు మాకయ్యా దేవ నీ దాపుఁ జేరిన
వారి కందరి కాపదలు బాపి నిత్య | కాపుగతిఁ జూపినావు‖ యేసు ‖
Verse
అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవ మమ్ముఁ పక్షముగ
రక్షించి మోక్షసు రక్షణకు దీక్షఁ గొని వీక్షితులమైన మాకు‖ యేసు ‖
Verse
అందమగు నీ మందిరమున బొందుగా మేము దేవ నీ సుందర
కరుణామృతము మా డెందముల యందు గ్రోలు టందుకు సుందరమైన‖ యేసు ‖

Related Tags

PraiseWorshipJesus