Verse
యేసు, నీ సదాత్మ వృష్టి
భక్తు లెల్లవారిపై
నీవు కుమ్మరింపఁగాను
నాపైఁ గుమ్మరించుమీ.
|| నన్నునున్, నన్ను నున్‖ నన్నునున్, నన్ను నున్ ‖
నన్నాశీర్వదించుమీ ||‖ నన్నాశీర్వదించుమీ ‖
Verse
తండ్రి, నన్ను దాఁటవద్దు
పాపి నంచు వేఁడెదన్
నీ మన్నింపు నీదు కృప
నా కనుగ్రహించుమీ
Verse
రక్షకా, నన్ దాఁటి పోకు
నేను నిన్ను నమ్మితిన్
నీదు దయ పూర్తిగాను
నాపైఁ గుమ్మరించుమీ.
Verse
పావనాత్మ, దాఁటి పోకు
నేను గుడ్డివాఁడను
జ్ఞానదృష్టి నాకు నిమ్ము
నాకు దైవ శక్తి నీ.
Verse
మాఱనట్టి దైవ ప్రేమ.
క్రీస్తు రక్త పుణ్యము
పావనాత్మ ప్రేరణంబు
నిండుగాను బోయుమీ.
Verse
నన్ను దాఁటిపోక యేసు
నీకు సేవచేయ నా
హృదయంబును బంధించి
నన్నాశీర్వదించుమీ