Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Nee Swaroopamunu

యేసు నీ స్వరూపమును

Yesu Nee Swaroopamunu

Verse
యేసు నీ స్వరూపమును నేను చూచుచు‖ 2x ‖
నీ పోలికగా నేను మారేదన్‖ 2x యేసు ‖
Verse
యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి
దాసుని రూపము ధరించి దీనుడైతివి‖ 2x ‖
నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను
నీదు వినయముతో నింపుము‖ 2x యేసు ‖
Verse
ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి‖ 2x ‖
నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను
నీ ప్రేమతో నింపుము‖ 2x యేసు ‖
Verse
యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్
నీ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్‖ 2x ‖
ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము
నీ పవిత్రతతో నింపుము‖ 2x యేసు ‖

Related Tags

WorshipRepentanceTransformation