Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Nee Swaroopamunu Nenu Chuchuchu Nee Polikaga Nenu Maredan

యేసు నీ స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదన్

Yesu Nee Swaroopamunu Nenu Chuchuchu Nee Polikaga Nenu Maredan

Chorus
యేసు నీ స్వరూపమును నేను చూచుచు‖ 2x ‖
నీ పోలికగా నేను మారెదన్‖ 2x ‖
Verse
యేసు నా కొరకు నీవు, పరలోకము విడచితివి
దాసుని రూపము ధరించి, దీనుడైతివి
నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను
నీదు వినయముతో నింపుము
Verse
ప్రేమ గల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
నీ ప్రేమ ద్వారానే, సమస్తము నిచ్చితివి
ఈ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను
నీ ప్రేమతో నింపుము
Verse
ప్రభువా నీవందరి యెడల, శాంతము వహించితివి
ఎవరును నశింపక యుండవలెనని
నేను సహించలేను, సహనమునే కోల్పోయాను
నీ శాంతముతో నింపుము
Verse
నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము
నీ సత్యము మేఘముల నంటుచున్నది
నే నయోగ్యదాసుడను, నిన్ను దుఃఖపెట్టి యున్నాను
నీ యధార్థతో నింపుము
Verse
యేసుని స్వరూపము కల్గి ఆయనవలె మారెదన్
ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్
ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము
నీ పవిత్రతతో నింపుము

Related Tags

HolinessDevotionTransformation