Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Nee Vaaramu

యేసు నీ వారము

Yesu Nee Vaaramu

Verse
యేసు నీ వారము – నీవే మా రాజువు‖ 2x ‖
తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే‖ 2x యేసు ‖
Verse
మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలం
అన్నీ నీవొసగినవే
మాదంతా నీకేలే – మహిమంతా నీకేలే
స్తుతి స్తోత్రముల్ నీకేలే‖ 2x ‖
సర్వంబు నీవైన ప్రభువా
హల్లెలూయ స్తుతి మహిమ నీకే‖ 2x యేసు ‖
Verse
ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరు
అన్నీ నీవొసగినవే
ఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని ఆ చంద్రుని
మాకోసం నిలిపితివే‖ 2x ‖
ఆద్యంతముల ప్రభువా
ఆరాధింతుము నిన్నే‖ 2x యేసు ‖
Verse
సిలువలో మరణించి – మరణమునే ఓడించి
జయమును పొందితివే
పాపములు క్షమించి – జీవమును మాకిచ్చి
పరమును ఒసగితివే‖ 2x ‖
మమ్మెంతో ప్రేమించి
మా కొరకు నిలచితివే‖ 2x యేసు ‖

Related Tags

PraiseWorshipDevotional