Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Needu Jaalivalla Lekka Leana

యేసు నీదు జాలివల్ల లెక్క లేన

Yesu Needu Jaalivalla Lekka Leana

Lyricist: Arthur Cleland Coons
Verse
యేసు, నీదు జాలివల్ల
లెక్క లేనివారలు
రక్షణంది సంతసిల్ల
నిమ్ము వారి డెందముల్
నీదు సిల్వ వంతవార్తఁ
జాటఁజేసి రాష్ట్రముల్
చూడ నిమ్ము త్రాణకర్త!
నీ కృపా ప్రకాశముల్
Verse
ఏమియున్ గ్రహింపకున్న
మర్త్యు డెంద మాశతో
నిన్ను ఁ గూర్చి తృష్ణ గొన్న
యాత్మ యేడ్చు మెండుగా
కోయఁబడ్డ గడ్డి మంచుఁ
గోరునట్లు పాపులు
నీవె రక్షకుండ వంచు
నిన్ సదా యాశింతురు.
Verse
ద్వీపవాసు లెత్తి కేలు
కోరుచుందు రిప్పుడు
నీదు సేవకాళి నంపి
యాత్మ క్రొంత్త జన్మమున్
ప్రేమదీప్తి జ్ఞానకాంతిఁ
గల్గం జేయు వాక్యము
నిచ్చి గొఱ్ఱె పిల్ల కీర్తిన్
వారి నోట నుంచుము

Related Tags

GraceSalvationEvangelism