Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Neeku Kaavalani

యేసూ… నీకు కావాలని

Yesu Neeku Kaavalani

Verse
యేసూ… నీకు కావాలని
నన్ను కోరుకున్నావా‖ 2x ‖
నే ఘోర పాపిని ప్రభువా
ఆ.. ఆ.. ఎందుకయ్యా నాపై నీ ప్రేమ‖ 2x ‖
కలుషాల్ని కడిగిన కరుణామయుడా
కన్నీటి గాథను మలిచావా ప్రభువా‖ 2x ‖
ఈ పేద బ్రతుకును అరచేతులలో
చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా‖ 2x ‖
నేను నేనే కానయ్యా
నాలో నీవే యేసయ్యా‖ 2x ‖
నీ ప్రేమకుప్పొంగిపోనా
ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా‖ 2x యేసూ ‖
దాహముతో ఉన్న నా యేసు ప్రభువా
నీ దాహం తీర్చే భాగ్యమునిమ్మయా‖ 2x ‖
నశియించు ఆత్మల దాహముతో
నను చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా‖ 2x ‖
నేను నేనే కానయ్యా
నాలో నీవే యేసయ్యా‖ 2x ‖
నీ ప్రేమకుప్పొంగిపోనా
ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా‖ 2x యేసూ ‖

Related Tags

DevotionalGraceLove