Verse
యేసూ! నీరక్త నీతులు - నా సొంపు, నాదు వస్త్రము
వీనన్ ధరించి, మెండు నీ - ధరన్ దిరంబునుందున్
Verse
ధైర్యాన నిల్తునీ నాడు - నన్నెవరు నింద పర్తురు?
పాపంబునుండి ముక్తుడన్ - నేనైతి వీనివల్లను
Verse
యుగాలు దాటి నన్నదా - ఈ నిష్కళంక వస్త్రము
ఇట్లుండు, రంగుమారదు - నీ వల్ల యంచుదెల్లగా
Verse
మృతుల్ నినున్ వినంగ నీచ - పాపుల్ సంతోషమొందనీ
యేసూ నీ రక్త నీతులు - నీవు వారి సొంపు వస్త్రము
Verse
పరాన నింటి కోసము - నే ధూళినుండి లేవగా
నటన్సహ నా పాటిదే యేసు నాకోస మీల్గెను