Verse
యేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదు
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము
మనుషులు నను మరచినా – నా వారే విడిచినా‖ యేసు ‖
Verse
నింగి నేల మారినా – స్థితి గతులు మారినా‖ 2x ‖
ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమ
ఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమ
కంటి పాపవలె కాయు నీవుండగా‖ యేసు ‖
Verse
దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన‖ 2x ‖
ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమ
రక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమ
నిత్య జీవమొసగె నీవుండగా‖ యేసు ‖