Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Neevu Nannu Premisthunnavu Needu Premanu Nenu Ponduchunnanu

యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు నీదు ప్రేమను నేను పొందుచున్నాను

Yesu Neevu Nannu Premisthunnavu Needu Premanu Nenu Ponduchunnanu

Chorus
యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు - నీదు ప్రేమను నేను పొందుచున్నాను
దిన దినము నాయెడల - నీ కృప విస్తరించు చున్నది‖ 2x ‖
నీ కృప విస్తరించు చున్నది.
Verse
ప్రేమతోనే పిలిచేవారు ఈ ధరణీలో ఎవరు లేరు
నా చేయిపట్టి నడిపేవారు ఈలోకమందు కానరారే‖ 2x ‖
అయితే తల్లిగా, తండ్రిగా నీవే వున్నావు
నీదు ప్రేమతో నా చేయిపట్టి నడుపుచున్నావు‖ 2x దినదినము ‖
Verse
నా యోగ క్షేమమడిగేవారు నా మిత్రులలో ఎవరులేరు
ఆధరణా చూపేవారు అయిన వారుకానరారే‖ 2x ‖
అయితే స్నేహమై, బంధమై నీవే వున్నావు
అన్నివేళలా ఆధరణ చూపుచున్నావు‖ 2x దినదినము ‖
Verse
కష్టాలు తీర్చేవారు ఒక్కరైనా కానరారే
ఓదార్పునిచ్చేవారు ఎవరు నాకు లేనేలేరే‖ 2x ‖
అయితే ప్రియుడవై, ప్రేమికుడవై నీవే వున్నావు
నిత్యము నీ సన్నిధిలో బలపరుచుచున్నావు‖ 2x దినదినము ‖

Related Tags

GraceLoveGuidance