Verse
యేసూ, నిన్ జూతు నిందుఁ దేటగా
అగోచరార్థముల్ నే ముట్టదున్
కృపన్ నేఁ బట్టకొందు గట్టిగా
నీ మీఁద వేయుదున్ నా భారము.
Verse
నే దైవాహార మిందె తిందును
ఆత్మీయ ద్రాక్షపాత్ర త్రాగుదున్
భూభారముల్ నేఁ బారవేయు దున్
క్షమా సౌఖ్యంబు గల్గుఁ క్రొత్తగా.
Verse
సంగీత భోజనాల కాలము
ప్రభుండు నాకై బల్ల వేసెను
విందారగించుచున్ నీ తోడి నా
మాధుర్య స్వల్ప మైత్ర్రిన్ బెంచుదున్.
Verse
సాయం బీవే, వేరే నా కెందుకు
వేరే చేమీఁద నానుకొనను
ప్రభూ, నిజంబుగా నీదే చాలును
నీ శక్తిలోనె బలం బుండున్
Verse
పాపంబు నాది, నీతి నీదెగా
నేరంబు నాది శుద్ధి నీదెగా
నీ రక్త నీతియే నా వస్త్రముల్
నా కాశ్రయంబు శాంతస్థితులు