Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Ninnu Joothu Nimdhudhaetagaa Agoacharaarthamul Nae Muttudhun

యేసు నిన్ను జూతు నిందుదేటగా అగోచరార్థముల్ నే ముట్టుదున్

Yesu Ninnu Joothu Nimdhudhaetagaa Agoacharaarthamul Nae Muttudhun

Verse
యేసు నిన్ను జూతు నిందుదేటగా
అగోచరార్థముల్ నే ముట్టుదున్
కృపన్ నేబట్టుకొందు గట్టిగా
నీ మీద వేయుదున్ నా భారము
Verse
నే దైవాహార మిందె తిందును
ఆత్మీయ ద్రాక్షాపాత్ర త్రాగుదున్
భూ భారముల్ నేబార వేయుదున్
క్షేమా సౌక్యంబు గల్గుకొత్తగా
Verse
సంగీత భోజనాల కాలము
ప్రభుండు నాకై బల్ల వేసెను
విందారగించుచున్ నీతోడినా
మాధుర్య స్వల్ప మైత్రిన్ బెంచుదున్
Verse
సాయంబీవే వేరే నాకెందుకు?
వేరే చేయి మీద నాను కొనను
ప్రభూ నిజంబుగా నీదే చాలున్
నీ శక్తిలోనే నా బలముండున్
Verse
పాపంబు నాది నీతి నీదేగా
నేరంబు నాది శుద్ధి నీదేగా
నీ రక్తనీతియే నా వస్త్రముల్
నా కాశ్రయంబు శాంతిస్థితులు

Related Tags

WorshipDevotionalChristian