Verse
యేసు నిన్ను నేను చూడలేను
చూడకుండా బ్రతుకలేను
ప్రభువా నీతో నేను నడువలేను
నిన్ను విడచి సాగలేను
యేసు రాజా రాజుల రాజా
నా కనులు తెరిచి కనిపించయా‖ 2x ‖
Verse
ఎత్తైన కొండపై నీవు పొందిన
రూపాంతర అనుభవము
నన్ను పొందనిమ్ము‖ 2x ‖
పేతురు యాకోబు యోహానులు
చూచినట్లు నను చూడనిమ్ము‖ 2x యేసు నిన్ను ‖
Verse
తిన్నని వీధిలో పౌలు భక్తునికి
దర్శనమిచ్చిన దేవా
నాకు నువ్వు కనబడుము‖ 2x ‖
ఆది అపోస్తలుల ఆత్మానుభవము
పొందినట్లు నను పొందనిమ్ము‖ 2x యేసు నిన్ను ‖