Verse
యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు
క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు‖ 2x ‖
నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు‖ 2x ‖
ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా‖ 2x యేసు ‖
పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు
కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు‖ 2x హల్లెలూయా ‖
దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము
ఈ భువిలో వెలసిన మానవ రూపము‖ 2x హల్లెలూయా ‖