Chorus
యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసే
మార్గము యేసే సత్యము యేసే జీవము యేసుకు శరణం‖ శరణం ‖
Verse
దేవకుమారశరణం నర జీవప్రదాత శరణం దేవదేవ
జగదావతారమము బ్రోవరావె ప్రభు నీవే శరణం‖ శరణం ‖
Verse
పాపవినాశక శరణం నర శాపవిమోచక శరణం పావనాత్మ భవదీయ
ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణం‖ శరణం ‖
Verse
పరమపురుషుడా శరణం ఓ నిరుపమప్రేమడ శరణం మరణ
మొంది మరి మృత్యుంజయుడై పరమున జరిగిన ప్రభువా శరణం‖ శరణం ‖
Verse
నీతిపూర్ణమా శరణం జగ జ్యోతి రత్నమా శరణం జాతిభేదరాహిత్యుడ
హితుడా నీతిప్రబోధక నీవే శరణం‖ శరణం ‖
Verse
తేజోమూర్తికి శరణం విభ్రాజిత కీర్తికి శరణం రాజరాజ యో భారత
రాజ్య ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం‖ శరణం ‖