Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Parishuddha Naamamunaku

యేసు పరిశుద్ధ నామమునకు

Yesu Parishuddha Naamamunaku

Verse
యేసు పరిశుద్ధ నామమునకు
ఎప్పుడు అధిక స్తోత్రము‖ 2x ‖
Verse
ఇహపరమున మేలైన నామము
శక్తి గల్గినట్టి నామమిది‖ 2x ‖
పరిశుద్దులు స్తుతించు నామమిది‖ 2x యేసు ‖
Verse
సైతానున్‌ పాతాళమును జయించు
వీరత్వము గల నామమిది‖ 2x ‖
జయమొందెదము ఈ నామమున‖ 2x యేసు ‖
Verse
నశించు పాపుల రక్షించు లోక
మున కేతెంచిన నామమిది‖ 2x ‖
పరలోకమున చేర్చు నామమిది‖ 2x యేసు ‖
Verse
ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు
ఉన్నత దేవుని నామమిది‖ 2x ‖
లోకమంతా ప్రకాశించే నామమిది‖ 2x యేసు ‖
Verse
శోధన, బాధల, కష్ట సమయాన
ఓదార్చి నడుపు నామమిది‖ 2x ‖
ఆటంకము తొలగించు నామమిది‖ 2x యేసు ‖

Related Tags

PraiseWorshipJesus