Chorus
యేసు పరిశుద్ధ నామమునకు - యెప్పుడు అధిక స్తోత్రమే
Verse
ఇహపరమున - మేలైన నామము - శక్తి గల్గినట్టి - నామమిది
పరిశుధ్ధులు స్తుతించు నామమిది - పరి‖ పరి ‖
Verse
సైతానున్ పాతాళ - మును జయించిన
వీరత్వము గల నామమిది - జయ‖ జయ ‖
మొందెదము యీ నామమున - జయ‖ జయ ‖
Verse
నశించు పాపుల రక్షింప లోక - మునకేతెంచిన - నామమిది
పరలోకమున జేర్చు నామమిది - పర‖ పర ‖
Verse
ఉత్తమ భక్తులు - పొగడి స్తుతించు
ఉన్నత దేవుని - నామమిది - లోక‖ లోక ‖
మంత ప్రకాశించె - నామమిది - లోక‖ లోక ‖
Verse
శోధన గాధల - కష్టసమయాన
ఓదార్చి నడుపు - నామమిది - ఆటం‖ ఆటం ‖
కము తీసివేయు నామమిది - ఆటం‖ ఆటం ‖