Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabho Neeku Nenu Naa Samasthamiththunu

యేసు ప్రభో నీకు నేను నా సమస్తమిత్తును

Yesu Prabho Neeku Nenu Naa Samasthamiththunu

Verse
యేసు ప్రభో నీకు నేను - నా సమస్తమిత్తును
నీ సన్నిధిలో వసించి - ఆశతో బ్రేమింతును
Chorus
నా సమస్తము - నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు - నా సమస్తము
Verse
యేసు ప్రభో నీకే నేను - దోసిలొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చు మిప్పుడే
Verse
నీదు వాడ నేను యేసు - నీవు నాదు వాడవు
నీవు నేను నేకమని - నీశుద్ధాత్మ సాక్ష్యము
Verse
యేసు ప్రభూ నీకు నన్ను - నీయ నేనే వచ్చితి
నీదు ప్రేమ శక్తి నింపి - నీదు దీవెన నియ్యవే
Verse
యేసు నీవే నా సర్వాస్తి - హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా - హల్లెలూయ స్తోత్రము

Related Tags

WorshipSurrenderDedication