Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabhu Gaddhepainunna Neeku Maa Sthuthulanu Chellinchedamu

యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు మా స్తుతులను చెల్లించెదము

Yesu Prabhu Gaddhepainunna Neeku Maa Sthuthulanu Chellinchedamu

Verse
యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు
మా స్తుతులను చెల్లించెదము
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండ వీవంచు కీర్తింతుము
Chorus
పాత్రుండవీవే పాత్రుండవీవే
పాత్రుండవీవే మాప్రభు నీవే
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండవీవంచు కీర్తింతుము
Verse
దేవుడౌ నీవు నరరూపమెత్తి
దూతలకన్న తగ్గింపబడి
స్త్రీ సంతానమౌ నీవు మరణించి
సర్పము తల నణగ ద్రొక్కితివి
Verse
నీ సృష్టియే సిల్వయొద్దకు నిన్ను
నడ్పి సిల్వన్ మేకులతో కొట్టిరి
దైవ మానవులచే వీడబడి
శాప నష్ట మనుభవించితివి
Verse
మహిమతో మరణమును గెల్చి
గొప్ప విజయము పొందితివి
చావు సమాధులపై విజయుండా
నిన్ను స్తుతింపక నెట్టులుందును

Related Tags

PraiseWorship